: మెదక్ చర్చిలో ఘనంగా క్రిస్ మస్ వేడుకలు


దేశంలోనే పేరొందిన మెదక్ చర్చిలో ఈ తెల్లవారుజామున క్రిస్ మస్ వేడుకలు ఆరంభమయ్యాయి. ముందుగా శిలువను ఊరేగించారు. ఏసుక్రీస్తు పుట్టిన రోజు కావడంతో చర్చిని రంగు రంగుల దీపాలతో చక్కగా అలంకరించారు. క్రైస్తవ సోదరులు ప్రార్థనలు నిర్వహించారు. దక్షిణ ఇండియా సంఘం మెదక్ అధ్యక్ష మండలం వైస్ చైర్మన్ రెవరెండ్ సాల్మన్ సందేశం ఇచ్చారు. సుమారు 2లక్షల మందికిపైగా ఈ రోజు మెదక్ చర్చికి వస్తారని అంచనా. ఇతర మతస్తులూ కొందరు ఇక్కడకు రావడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. మరోవైపు విజయవాడలోని సెయింట్ పీటర్స్ కేథడ్రల్ చర్చిలో నిన్న అర్ధరాత్రి క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అలాగే రాష్ట్రంలోని ఇతర చర్చిలు కూడా క్రైస్తవులతో శోభను సంతరించుకున్నాయి. ప్రత్యేక గీతాలు, ప్రార్థనలతో సందడిగా మారాయి.

  • Loading...

More Telugu News