: తెలంగాణ ప్రజా ఫ్రంట్ అధ్యక్షుడు ఆకుల భూమయ్య దుర్మరణం
నాలుగు దశాబ్దాల అలుపెరుగని పోరాటం ఆగిపోయింది. ప్రజాస్వామ్య ప్రత్యేక తెలంగాణ కోసం చేపట్టిన ఉద్యమంలో తన జీవితాన్నే ధారపోసిన ఓ మహా నేత నేలకొరిగారు. తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షుడు, ఉపాధ్యాయ ఉద్యమనేత ఆకుల భూమయ్య (63) నిన్న రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. నిన్న సాయంత్రం హైదరాబాద్ బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రజాస్వామ్య తెలంగాణ పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని... అడిక్ మెట్ లోని తన నివాసానికి చేతక్ లో బయలుదేరిన భూమయ్యను జీహెచ్ఎంసీకి చెందిన టిప్పర్ ఢీకొంది. ఈ దుర్ఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. 2010లో ఏర్పడిన తెలంగాణ ప్రజాఫ్రంట్ లో గద్దర్ తో కలిసి ఆయన కీలక పాత్ర పోషించారు. తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీలో కూడా ఆయన రాష్ట్ర స్థాయి నాయకుడిగా పనిచేశారు.