: నెక్లెస్‌లాగా కనపడినా ... చక్కగా వినపడుతుంది!
ఈ నెక్లస్ టూ ఇన్ వన్. అంటే, మనకు రెండు రకాలుగా ఉపయోగపడుతుంది. బోసి మెడ లోటు తీర్చడమే కాకుండా, వినికిడి లోపాన్ని కూడా సవరిస్తుంది. అమెరికాకు చెందిన ఒక సంస్థ నెక్లెస్‌లాంటి ఒక సరికొత్త వినికిడి పరికరాన్ని తయారుచేసింది. ఇది పైకి నెక్లెస్‌లాగా కనిపించినా దీనిలో చిన్న మైక్రోఫోన్ ఇమిడివుంటుంది. ఈ మైక్రోఫోన్‌ను ఎలాంటి హెడ్‌ఫోన్లకైనా అనుసంధానించుకోవచ్చు. మన చుట్టుపక్కల ఆరు అడుగుల దూరం వరకూ వెలువడే శబ్దాలను గ్రహించి ఇది స్పష్టంగా వినిపించేలా చేస్తుందని దీన్ని తయారుచేసిన వారు చెబుతున్నారు.