: తెదేపా హయాంలోనే పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాం: చంద్రబాబు
తెలుగుదేశం హయాంలోనే హైటెక్ సిటీ ఏర్పాటు చేసి యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. ఈ రోజు రాయలసీమ జిల్లాలకు చెందిన యువకులతో పాటు రంగారెడ్డి జిల్లా యువకులు పెద్ద ఎత్తున చంద్రబాబు సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహించడంతోపాటు బ్యాక్ లాగ్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ లకు బుద్ధి చెబితేనే అవినీతి అంతమవుతుందన్నారు.