: మోడీ సభకు పాట్నా పేలుళ్ల నిందితుల కుటుంబాలకు ఆహ్వానం


జార్ఖండ్ లోని రాంచీలో ఈ నెల 29న బీజేపీ ప్రధాని అభ్యర్ధి నరేంద్ర మోడీ ప్రసంగించనున్న ర్యాలీలో పాల్గొనాల్సిందిగా, పాట్నా వరుస బాంబు పేలుళ్ల కేసుల్లో నిందితుల కుటుంబాలకు ఆ పార్టీ ఆహ్వానం పలికింది.'దారి తప్పిన కొందరు తనయులు' చేసిన నేరానికి వారి కుటుంబాలకు శిక్ష విధించడం సరికాదన్న ఉద్దేశంతో తమ పార్టీ ఈ నిర్ణయం తీసుకుందని బీజేపీ బీహార్ శాఖ అధ్యక్షుడు మంగళ్ పాండే తెలిపారు. ఈ ఏడాది అక్టోబర్ 27న పాట్నాలో మోడీ ర్యాలీ జరిగినప్పుడు సంభవించిన వరుస బాంబు పేలుళ్లలో ఆరుగురు ప్రాణాలు కోల్పోగా, 80 మందికి పైగా గాయపడిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News