: హైదరాబాదు యశోద ఆసుపత్రిలో గుండె మార్పిడి చికిత్స విజయవంతం
హైదరాబాదు నగరంలోని యశోద ఆస్పత్రి వైద్యులు 25 సంవత్సరాల మహిళకు గుండె మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ విషయాన్ని యశోద ఆసుపత్రి వర్గాలు దృవీకరించాయి. గుండె మార్పిడి శస్త్రచికిత్సలు గతంలోనూ జరిగాయని.. అయితే తక్కువ సమయంలోనే రోగి కోలుకోవడం దేశంలోనే ఇదే ప్రథమమని డాక్టర్ గోపాల కృష్ణ గోఖలే పేర్కొన్నారు. తూర్పు గోదావరి జిల్లా వాసి రమ్య గుండెజబ్బుతో బాధపడుతుండటంతో ఈ చికిత్స చేసినట్లు ఆయన చెప్పారు. ‘జీవన్ దాన్’ ద్వారా బ్రెయిన్ డెడ్ అయిన 21 ఏళ్ల యువకుడి గుండెను వారం రోజుల క్రితం సేకరించామని.. నాలుగు గంటల పాటు శ్రమించి బాధితురాలికి శస్త్రచికిత్స చేసి గుండెను అమర్చినట్లు ఆయన తెలిపారు.