: వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తాం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ
ఢిల్లీ ముఖ్యమంత్రిగా కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారమే కాంగ్రెస్, బీజేపీ ప్రత్యామ్నాయానికి సూచన అని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. దేశ ప్రజలు ప్రత్యామ్నాయాన్ని కోరుకొంటున్నారంటూ ఆమ్ ఆద్మీ పార్టీని ఆయన ఉదాహరించారు. కాగా, 2014 ఎన్నికల్లో సీపీఐ ఒంటరిగానే పోటీ చేస్తుందని ఆయన తెలిపారు. తెలంగాణ ఏర్పడితే వీసా తీసుకొని రావాలన్న కావూరి సాంబశివరావు.. ఇప్పుడు సిరిసిల్లకు ఎలా వచ్చారని నారాయణ ప్రశ్నించారు.