: కుదుటపడుతున్న ఇళయరాజా ఆరోగ్యం
సంగీత దర్శకుడు ఇళయరాజా(70) ఆరోగ్యం కుదుటపడుతోందని ఆయన మేనల్లుడు, తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు తెలిపారు. 'మా అంకుల్ ఇళయరాజా ప్రస్తుతం చాలా బాగున్నారు. ఆయన పట్ల అందరి ప్రేమ, ప్రార్ధనలకు కృతజ్ఞతలు' అంటూ ట్విట్టర్లో ప్రభు పోస్ట్ చేశారు. స్వల్ప గుండెపోటు కారణంగా నిన్న (సోమవారం) ఇళయరాజాను కుటుంబ సభ్యులు చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో జేర్చారు.