: గవర్నర్ ప్రసంగంపై మండిపడ్డ ప్రతిపక్షాలు
ఈ సారి ప్రతిపక్షాలన్నీ గవర్నర్ ప్రసంగంపై మండిపడ్డాయి. అన్ని పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయన ప్రసంగాన్ని ఆక్షేపించారు. టీడీపీ సభ్యులు ఏకంగా గవర్నర్ ప్రసంగాన్నే బహిష్కరించారు. దొంగల ప్రభుత్వాన్ని గవర్నర్ తన ప్రభుత్వంగా చెబుతున్నారని టీడీపీ ఎమ్మెల్యేలు మీడియాతో అన్నారు.
ప్రజా సమస్యల పరిష్కారం పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మండిపడ్డారు. గత మూడు ప్రసంగాలలో ఇచ్చిన హామీలు అమలు కాలేదని చెప్పారు. టీడీపీ నేత గాలి ముద్దు కృష్ణమనాయుడు అయితే పనికిమాలిన గవర్నర్, పనికిమాలిన ప్రసంగమని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే మోత్కుపల్లి, గవర్నర్ ది ఊకదంపుడు ప్రసంగంగా అభివర్ణించారు.

12 ఏళ్లుగా తెలంగాణ కోసం పోరాడుతుంటే గవర్నర్ తన ప్రసంగంలో దాని గురించి ఒక్క మాటా మాట్లాడకపోవడం సిగ్గుచేటని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్ష నేత ఈటెల్ రాజేందర్ అన్నారు. తెలంగాణ నిధులతో ముఖ్యమంత్రి తన చిత్తూరు జిల్లాకు సోకులు, విశాఖకు మెరుగులు అద్దుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇక గవర్నర్ ప్రసంగంలో ప్రజా సమస్యల ప్రస్తావన లేదని, వాటి పరిష్కారం కోసం సూచనలే లేవని సీపీఐ ఎమ్మెల్యే గూండా మల్లేశం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనది సాదాసీదా ప్రసంగమన్నారు.
గవర్నర్ తన ప్రసంగంలో కరెంటు కోతలు లేవని కూతలు కూశారని సీపీఎం ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి అన్నారు. గవర్నర్ ఊకదంపుడు ఉపన్యాసం వినిపించారని విమర్శించారు. అంతకుముందు సభలో గవర్నర్ ప్రసంగిస్తుండగా సీపీఎం సభ్యులు ప్లకార్డులతో నిరసన వ్యక్తం చేశారు.
ఇక గవర్నర్ ప్రసంగంలో తెలంగాణ అంశాన్ని ఎందుకు పెట్టలేదని తెలంగాణ నగారా సమితి అధ్యక్షుడు, ఎమ్మెల్యే నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు.
గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట అని వైఎస్‌ఆర్ కాంగెస్ పార్టీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, బాబురావు, కాపు రామచంద్రారెడ్డి అభివర్ణించారు. కిరణ్ ఇచ్చిన స్క్రిఫ్ట్‌ను ఆయన చదివారని అన్నారు.
గవర్నర్ ప్రసంగం అబద్ధాల పుట్ట అని వైఎస్‌ఆర్ కాంగెస్ పార్టీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకర్ రెడ్డి, బాబురావు, కాపు రామచంద్రారెడ్డి అభివర్ణించారు. కిరణ్ ఇచ్చిన స్క్రిఫ్ట్‌ను ఆయన చదివారని అన్నారు.