: ప్రభుత్వ బంగ్లాను కూడా నిరాకరించిన కేజ్రీవాల్
దేశ రాజధాని ఢిల్లీలో రెండు రోజుల్లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం కల్పించే సదుపాయాలను వరసగా నిరాకరిస్తున్నారు. రాజధాని కొత్త ముఖ్యమంత్రి కోసం ప్రభుత్వం బంగ్లా సదుపాయాన్ని కల్పించనున్నట్లు ఢిల్లీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సపోలియా కేజ్రీవాల్ తో భేటీ సమయంలో తెలిపారు. ఆ సదుపాయం తనకు అక్కరలేదని ఆయన తిరస్కరించారు. ప్రభుత్వం ఇచ్చే భద్రత తనకు అవసరం లేదని కేజ్రీవాల్ నిన్న (సోమవారం) తెలిపిన సంగతి తెలిసిందే.