: పార్టీ మారే ఆలోచనలో జేసీ కుటుంబం!


దశాబ్దాల తరబడి కాంగ్రెస్ ను అంటిపెట్టుకున్న మాజీమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జేసీ దివాకర్ రెడ్డి కుటుంబం పార్టీ మారే ఆలోచన చేస్తోంది. ఇదే విషయాన్ని ఆయన సోదరుడు జేసీ ప్రభాకర్ రెడ్డి తెలిపారు. ఈ రోజు ప్రత్యేక మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన.. ఇప్పటివరకు తాము కాంగ్రెస్ లో ఉన్నామని, ఇప్పుడు కాంగ్రెస్ ను వీడి వెళ్లాలంటే చాలా బాధగా ఉందన్నారు. కానీ, తప్పటం లేదన్నారు. కార్యకర్తల ఒత్తిడివల్లే పార్టీ మారనున్నట్లు ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అంతేకాక సమైక్యాంధ్ర వల్లే తమ ప్రాంతంలో తమ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని వివరించారు. ఇక తమ కుమారులు కూడా రాజకీయాల్లోకి తప్పకుండా వస్తారని ఆయన తెలిపారు.

  • Loading...

More Telugu News