: 'ఒంటిచేతి' రికార్డు!


ఒంటిచేత్తో ఏం రికార్డు... అనుకోకండి... ఒకచేతితో చప్పట్లు కొట్టి రికార్డు సృష్టించడానికి ప్రయత్నిస్తోంది. ఒక్క చేత్తో ఏం చప్పట్లు కొడతారు... అంటే ఒక అమ్మాయి ఒక్క చేతితోనే చప్పట్లు కొట్టి రికార్డు సృష్టించడానికి ప్రయత్నిస్తోంది.

నిజామాబాద్‌కు చెందిన బీటెక్‌ విద్యార్ధిని సౌజన్య ఒక్క చేతితో చప్పట్లు కొట్టి రికార్డు సృష్టించింది. గతంలో నిమిషానికి 310 చప్పట్లను ఒకచేతితో కొట్టిన రికార్డు ఉండగా, సౌజన్య నిమిషానికి 360 చప్పట్లను కొట్టి పాత రికార్డును బద్దలుకొట్టింది. సోమవారం నాడు ఈ ఒంటిచేతి చప్పట్ల కార్యక్రమాన్ని అధికారుల సమక్షంలో వీడియో తీయించి, దాన్ని గిన్నీస్‌ బుక్‌ అధికారులకు పంపించారు. మొత్తానికి ఒక్కచేత్తో కూడా చప్పట్లు కొట్టి రికార్డు సృష్టించవచ్చన్నమాట!

  • Loading...

More Telugu News