: సైబరాబాద్ కమిషనర్ పై హైకోర్టులో పిటిషన్
సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. తన భూమి కబ్జా అయిన కేసును కమిషనర్ పట్టించుకోవడం లేదని ఓ మహిళ పిటిషన్ లో పేర్కొంది. కోర్టు, ఉన్నతాధికారుల ఆదేశాలను ఆనంద్ పట్టించుకోవడం లేదని, చట్టాన్ని తన చేతుల్లోకి తీసుకుంటున్నారని ఆరోపించారు. ఈ పిటిషన్ రేపు కోర్టులో విచారణకు రానుంది.