: తిరుమల లోయలో పడిన కారు.. ఆరుగురికి గాయాలు
తిరుమల నుంచి తిరుపతికి వెళ్లే ఘాట్ రోడ్డులో 32 వ మలుపు వద్ద భక్తులతో వెళుతున్న ప్రైవేటు వాహనం లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. వీరంతా బెంగళూరుకు చెందిన భక్తులుగా గుర్తించారు.