: తప్పుడు సమాచారం ఇచ్చిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలంటున్న ఈసీ
సాధారణ ఎన్నికల సమయంలో నామినేషన్ వేసే ప్రతి అభ్యర్థి తమ సామాజిక, ఆర్థిక నేపథ్యం గురించి ఎన్నికల కమిషన్ కు అఫిడవిట్ సమర్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చిన వారిని తక్షణమే అనర్హులుగా ప్రకటించి, రెండు సంవత్సరాలు జైలు శిక్ష విధించేందుకు తమకు అధికారాలు ఇవ్వాలని ఈసీ కోరనుంది. ఈ మేరకు అభ్యర్థులు తమ నేర చరిత్ర, ఆస్తులు, విద్యా నేపథ్యం గురించి ఆన్ లైన్ లో పెట్టి... వాటినే ప్రింట్ అవుట్ తీసుకుని ఈసీకి సమర్పించాలి. ఒకవేళ అభ్యర్థులు తప్పుడు సమాచారం ఇస్తే వెబ్ సైట్ అప్లికేషన్ లో తదుపరి కాలమ్ కు వెళ్లకుండా ఉండే అవకాశం ఉంటుంది. అందుకని తప్పకుండా అభ్యర్థులు కచ్చితమైన సమాచారం అందించాల్సి ఉంటుంది.