: అత్యాచార నిరోధక బిల్లుకు కేంద్రమే మోకాలడ్డుతోంది: మాయావతి
కేంద్ర మంత్రి వర్గంలో విభేదాలే అత్యాచార నిరోధక బిల్లుకు అడ్డంకిగా పరిణమించాయని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి ఆరోపించారు. ప్రస్తుత సమావేశాల్లో బిల్లుకు ఆమోదం తెలపకపోతే, ఆర్డినెన్స్ వీగిపోతుందని తెలిసీ, కేంద్రం ఉదాసీన వైఖరి కనబరుస్తోందని ఆమె విమర్శించారు.
ఈ విషయంలో కేంద్రంలో స్పష్టత లోపించిందని ఆమె వ్యాఖ్యానించారు. ఎంతో ప్రాముఖ్యత ఉన్న ఈ బిల్లు విషయంలో హోం శాఖ, న్యాయ శాఖ మధ్య అభిప్రాయభేదాలు ఉన్నట్టు తన వద్ద సమాచారం ఉందని మాయావతి వెల్లడించారు. బిల్లును అనిశ్చితిలోకి నెట్టాలని ప్రయత్నిస్తే దేశ మహిళలు క్షమించరని ఆమె హెచ్చరించారు.