: పాక్ మొబైల్ కంపెనీకి ప్రచారకర్తగా కరీనా కపూర్
దాయాది దేశం పాకిస్థాన్ కు చెందిన ప్రముఖ 'క్యూ మొబైల్' కంపెనీకి ప్రచారకర్తగా బాలీవుడ్ నటి కరీనా కపూర్ వ్యవహరించనుంది. ఈ మేరకు ఆ సంస్థతో కుదుర్చుకున్న ఒప్పందానికి కరీనా సంతకం కూడా చేసిందట. త్వరలో మొబైల్ కు సంబంధించి ఓ యాడ్ ను థాయ్ లాండ్ లో చిత్రీకరించనున్నారు. ఇందులో బెబో కనిపిస్తుంది. పాక్ లో కరీనాకు బాగా పాప్యులారీటీ ఉండటం వల్లనే ప్రచారకర్తగా ఎంచుకున్నట్లు క్యూ మొబైల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ తెలిపారు.