: రాష్ట్రంలో నీట్, ఎంసెట్ రెండూ రాయవచ్చు: కేంద్ర మంత్రి ఆజాద్
ఎంసీఐ పరిధిలోని అన్ని మెడికల్ కాలేజీల్లో యూజీ, పీజీ కోర్సుల్లో ప్రవేశించాలంటే నీట్ రాయాల్సిందేనని కేంద్ర మంత్రి గులాంనబీ ఆజాద్ స్పష్టం చేశారు. అయితే, సుప్రీం కోర్టు మధ్యంతర ఉత్తర్వులను అనుసరించి ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు నీట్, ఎంసెట్ రెండు పరీక్షలూ రాయవచ్చని ఆజాద్ వెల్లడించారు.
ఈరోజు రాజ్యసభలో టీడీపీ సభ్యురాలు గుండు సుధారాణి అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, ఆయన పైవిధంగా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలు నీట్ పై హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. అయితే, ఆ పిటిషన్లన్నీ సుప్రీంకు బదిలీ అయ్యాయి. అవి పరిశీలించిన సుప్రీం గత డిసెంబర్ 13న ఆంధ్రప్రదేశ్ విద్యార్ధులు నీట్, ఎంసెట్ రెండింటికీ హాజరుకావచ్చని తెలిపింది.