: రోజుకు రెండు వేలు చాలు...


రోజుకు రెండువేలు చాలు... మీ గుండె భద్రంగా ఉంటుందట. రెండు వేలు అంటే డబ్బు అనుకుంటారేమో... డబ్బు కాదు... అడుగులు. రోజూ రెండువేల అడుగులు వేశారంటే భవిష్యత్తులో మీ గుండె చాలా ఆరోగ్యంగా, భద్రంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

వయసు పెరిగేకొద్దీ ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువవుతుంటాయి. ఇలాంటి వాటిలో ముఖ్యంగా గుండెకు సంబంధించిన సమస్యలు కొందరిలో మరింత ఎక్కువగా ఉంటాయి. గుండెపోటు వచ్చే ప్రమాదాన్ని తగ్గించుకోవాలంటే యుక్త వయసులోనుండే రోజుకు రెండు వేల అడుగుల దూరం నడిస్తే చాలని పరిశోధకులు చెబుతున్నారు. నడక ఆరోగ్యానికి మంచిదని ఎప్పటినుండో నిపుణులు చెబుతున్నారు. కానీ ఎంత దూరం నడవాలి అనే విషయాన్ని పక్కనపెడితే రోజుకు రెండువేల అడుగుల దూరంపాటు నడిస్తే మంచిదని తాజాగా వైద్యులు చెబుతున్నారు.

యూకేకు చెందిన పరిశోధకులు నిర్వహించిన ఒక అధ్యయనంలో యుక్తవయసునుండి ఇలా రెండువేల అడుగుల చొప్పున నడవడం మొదలుపెడితే భవిష్యత్తులో మన గుండె చాలా భద్రంగా ఉంటుందని తేలింది. రోజుకు రెండువేల అడుగులు నడవడం అంటే 20 నిముషాలపాటు వ్యాయామం చేయడంతో సమానం, రోజుకు కనీసం ఈ మాత్రం వ్యాయామం చేయడం వల్ల హార్ట్‌ అటాక్‌ ప్రమాదాన్ని ఎనిమిది శాతం వరకూ తగ్గించుకోవచ్చట. మీకు ఇంకా ఓపికవుంటేగనుక రోజుకు కనీసం 40 నిముషాల పాటు నడవడం వల్ల మీ గుండెకు సంబంధించిన సమస్యలు 20 శాతం వరకూ తగ్గుతాయని యూనివర్సిటీ ఆఫ్‌ లీసెస్టర్‌కు చెందిన పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News