: స్మగ్లర్లను చితకబాదిన అటవీ అధికారులు


కడప జిల్లా రైల్వేకోడూరులో ఎర్రచందనం స్మగ్లర్లపై అటవీ శాఖాధికారులు దాడి చేశారు. ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకునేందుకు కూంబింగ్ నిర్వహిస్తున్న ఇద్దరు అధికారులను హతమార్చిన సంగతి తెలిసిందే. ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకునేందుకు పోలీసులు ప్రాణాలను పణంగా పెట్టాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో భారీగా పోలీసు బలగాలు శేషాచల అడవుల్లో స్మగ్లర్ల ఏరివేతకు రంగంలోకి దిగి అటవీ ప్రాంతాన్ని జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో అడవిలోకి వచ్చిన ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్లను పట్టుకున్న అధికారులు వారిని చితకబాదారు. స్మగ్లర్లపై దాడి చేస్తుండగా తీసిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది.

  • Loading...

More Telugu News