: ముస్లింల సంక్షేమాన్ని కాంక్షించేది టీడీపీనే: కేశినేని నాని


రాష్ట్రంలోని ముస్లింల సంక్షేమం కోసం పాటుపడేది కేవలం తెలుగుదేశం పార్టీయేనని ఆ పార్టీ నేత కేశినేని నాని తెలిపారు. ఈ రోజు విజయవాడ చిట్టినగర్ లోని టీడీపీ ఆఫీసులో, ముస్లింలతో ఆత్మీయ సభను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ముస్లింల కోసం టీడీపీ ప్రభుత్వం ఎంతో చేసిందని... కాంగ్రెస్ పార్టీ మాత్రం ముస్లింల సంక్షేమాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో ముస్లింలు చంద్రబాబును ఎన్నుకోవాలని కోరారు.

  • Loading...

More Telugu News