: ప్రముఖ నటి శ్రీదేవి ఇంట్లో అగ్నిప్రమాదం


ముంబై నగరంలో అంధేరి వెస్ట్ ప్రాంతంలోని నటి శ్రీదేవి ఇంట్లో అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆమె బెడ్ రూమ్ లో మంటలు చెలరేగాయి. దీంతో ఆమె పడక గది మొత్తం అగ్నికి ఆహుతయింది. అదృష్టవశాత్తు శ్రీదేవి కుటుంబ సభ్యులు ఈ ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. శనివారం రాత్రి శ్రీదేవి ఇంట్లోని ఎయిర్ కండీషనర్ నుంచి మంటలు వెలువడ్డాయి. అయితే సకాలంలో మంటలను అదుపులోకి తీసుకురావడంతో ప్రమాదం తప్పింది.

అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో శ్రీదేవి, ఆమె అత్తగారు, ఇద్దరు కూతుళ్లు జాహ్నవి, ఖుషీ ఇంట్లోనే ఉన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే శ్రీదేవి అత్తగారిని సంజయ్ కపూర్ ఇంటికి, ఇద్దరు కుమార్తెలను స్నేహితుల నివాసాలకు పంపివేసారు. ఆమె అప్రమత్తమై తగు జాగ్రత్తలు తీసుకోవడంతో ఎవరికీ ఏం కాలేదు. అయితే, ఆమె నివాసంలో విద్యుత్ సరఫరా మాత్రం నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న ఆమె భర్త బోనీకపూర్ రాత్రి 9.30 కి ఇంటికి వచ్చారు. కరెంట్ లేక లేకపోవడంతో చేసేది లేక కుటుంబ సభ్యులందరూ రాత్రంతా ఒక హోటల్ లో మకాం చేశారని తెలిసింది. ప్రమాద వార్త తెలుసుకొన్న పలువురు సినీ ప్రముఖులు ఆమెకు ఫోన్ చేసి పరామర్శించారు.

  • Loading...

More Telugu News