: కలిస్ ఔట్, జహీర్ 300 వికెట్లు
జొహానెస్ బర్గ్ లో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా ఎదురీదుతోంది. పీటర్సన్ ఔటైన తర్వాత బరిలోకి దిగిన కలిస్ ధాటిగా ఆడి 37 బంతుల్లో 34 పరుగులు చేశాడు. అయితే జహీర్ వేసిన బంతికి కలిస్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఈ వికెట్ తో జహీర్ టెస్టు మ్యాచుల్లో 300 వికెట్ల క్లబ్ లో చేరాడు. అంతేకాకుండా, 300 వికెట్లు తీసిన నాలుగో భారతీయుడిగా జహీర్ రికార్డులకెక్కాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా 4 వికెట్ల నష్టానికి 214 పరుగులతో ఆడుతోంది. డు ప్లెసిస్ 35 పరుగులతో, డీవిలియర్స్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.