: మూడో వికెట్ కోల్పోయిన దక్షిణాఫ్రికా
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు చివరి రోజున ప్రారంభంలోనే భారత్ వికెట్ల వేటను మొదలు పెట్టింది. ఈ రోజు ఆటను 2 వికెట్ల నష్టానికి 138 పరుగులతో ప్రారంభించిన సౌత్ ఆఫ్రికా ఆదిలోనే పీటర్సన్ వికెట్ ను కోల్పోయింది. నిన్నటి తన వ్యక్తిగత స్కోరు 76 పరుగులకు ఒక్క పరుగు కూడా జోడించకుండానే, పీటర్సన్ మొహమ్మద్ షమీ బౌలింగ్ లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. అనంతరం డు ప్లెసిస్ కు కలిస్ జతకలిశాడు. ప్రస్తుతం సౌతాఫ్రికా స్కోరు 3 వికెట్ల నష్టానికి 151 పరుగులు. విజయం సాధించాలంటే సఫారీలు మరో 307 పరుగులు చేయాలి.