: పరిశీలనలో 'మున్సిపల్ ఎన్నికల' నిర్వహణ : ఆనం
సహకార సంఘాల ఎన్నికలు పూర్తవ్వకుండానే మరో ఎన్నికల సమరానికి తెర లేవనుంది. మే నెలాఖరులో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని భావిస్తున్నట్లు మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై రైతులకు పెరిగిన విశ్వాసానికి సహకార సంఘాల ఎన్నికల్లో విజయమే నిదర్శనమని ఆయన అన్నారు. తొమ్మిది మంది ఎమ్మెల్యేలను బహిష్కరించలేదన్న ఆనం.. పీసీసీ అధ్యక్షుడు బొత్స వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందన్నారు. శాసన సభ బడ్జెట్ సమావేశాల్లో తమ సంఖ్యా బలం నిరూపిస్తామని ఆయన స్పష్టం చేశారు.