: ప్రధాని పదవికి రాహుల్ గాంధీనే అర్హుడు: వీరప్ప మొయిలీ
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని పదవికి సమర్థుడని కేంద్ర మంత్రి వీరప్పమొయిలీ అన్నారు. ప్రధానమంత్రి అయ్యేందుకు కావలసిన అన్ని అర్హతలు రాహుల్ కు ఉన్నాయని ఆయన చెప్పారు. ముంబైలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఉన్న నేతల్లో ప్రధాని పదవికి రాహులే సరైన వారని ఆయన పేర్కొన్నారు. దేశంలోని యువత కూడా రాహుల్ భవిష్యత్ ప్రధాని కావాలని కోరుకుంటోందన్నారు.