: చెన్నైలో కెప్టెన్ టీవీ చానెల్ ఎడిటర్ అరెస్ట్
తెహల్కా తేజ్ పాల్ కేసును మర్చిపోకముందే... చెన్నై నగరంలో మరో లైంగిక వేధింపుల కేసు వెలుగులోకి వచ్చింది. కెప్టెన్ టీవీ చానెల్ ఎడిటర్ దినేష్ తనను లైంగికంగా వేధించాడంటూ ఓ మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆయనను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.
తెహల్కా కేసు అనంతరం, ఇప్పుడు కెప్టెన్ ఎడిటర్ ఉదంతంతో మీడియాలో పనిచేసే మహిళా జర్నలిస్టులు తమ భద్రత విషయంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విధుల నిర్వహణలో తలమునకలయ్యే తమకు తగిన భద్రత కల్పించాల్సిన అవసరముందని వారు అభిప్రాయపడుతున్నారు.