: ముంబైలో నేడు మోడీ భారీ బహిరంగ సభ.. ఏడంచెల భద్రత


దేశ ఆర్థిక రాజధాని ముంబైలో నేడు బీజేపీ భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది. ఈ సభకు బీజేపీ ప్రధాని అభ్యర్థి నరేంద్ర మోడీ హాజరవుతున్నారు. 2014లో జరగనున్న సాధారణ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ఈ సభను ఏర్పాటుచేశారు. దీంతో ముంబైలో ఏడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. అంతేకాకుండా, సభాస్థలి వద్ద దాదాపు 3 వేల మంది సాయుధ పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్టు ముంబై పోలీసు కమిషనర్ సత్యపాల్ సింగ్ తెలిపారు. వీరికి తోడు బాంబ్ డిస్పోజబుల్ స్వ్కాడ్ ఇప్పటికే తమ పనిని ప్రారంభించింది.

ఈ సభకు దాదాపు 10 లక్షల మంది హాజరవుతున్నట్టు ముంబై బీజేపీ అధ్యక్షుడు అశిష్ శేలార్ తెలిపారు. మరో ముఖ్య విషయం ఏంటంటే... సభకు హాజరయ్యే వారికి టీ అందించడానికి 10 వేల మంది చాయ్ వాలాలను కూడా నియమించారు. వీరందరికీ వీఐపీ పాస్ లను అందజేశారు. వివిధ ప్రాంతాల నుంచి సభకు హాజరయ్యే వారి కోసం 20 దూర ప్రాంత రైళ్లను ఏర్పాటు చేశారు.

  • Loading...

More Telugu News