: ప్రాణార్పణం ఆడజాతే చేస్తుందట!


ఎవరైనా జాతి అభివృద్ధి కోసం తమ ప్రాణాలను పణంగా పెడతారా...? ఒకరకమైన పురుగుల జాతిలో తమ జాతి అభివృద్ధికోసం ప్రాణాలను అర్పించే ఆడజాతి వుంది. ఈ విషయాన్ని శాస్త్రవేత్తలు ప్రత్యేక పరిశోధనల్లో గుర్తించారు. ఆడజాతి తనకు మరణం సంభవిస్తుందని తెలిసినా కూడా పిల్లలకు జన్మనిస్తుందని పరిశోధకులు గుర్తించారు.

ప్రిన్స్‌టన్‌ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు కానరీహాబ్డిటిస్‌ ఎలెగాన్స్‌ అనే ఒకరకమైన పురుగులపై చేసిన పరిశోధనల్లో ఆ జాతికి చెందిన ఆడ పురుగులు తమ జాతి వృద్ధికోసం ప్రాణాలను కూడా అర్పిస్తాయని గుర్తించారు. తమ పరిశోధనల్లో వీర్యం తన శరీరంలోకి ప్రవేశించిన తర్వాత ఆడ క్రిములు ముడుచుకుపోవడం ప్రారంభమై, చివరికి పిల్లలకు జన్మనివ్వగానే వెంటనే అవి చనిపోవడాన్ని పరిశోధకులు గుర్తించారు. మగక్రిమి వీర్యం ఆడ క్రిముల జీవితకాలాన్ని రెండు నుండి మూడు వంతులు తగ్గిస్తుందని మాలిక్యులర్‌ బయాలజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ కొలిన్‌ ముర్ఫి చెబుతున్నారు. మగక్రిములు తమ జీన్స్‌ను తమ ముందు తరాలకు అందించేందుకు ఆడ క్రిముల అవసరం ఎప్పుడూ ఉంటుందని, ఒక్కసారి అవి గర్భందాల్చితే అవి వందలకొద్దీ పిల్లక్రిములకు జన్మనివ్వగలవని, అయితే పిల్లల సంరక్షణకు తల్లి అవసరం ఉండదని, తల్లి చనిపోవడం తండ్రికి జన్యుపరమైన ప్రయోజనం అని ముర్ఫి వివరించారు.

  • Loading...

More Telugu News