: ఆర్టీఐ కార్యకర్త హత్య కేసులో బీజేపీ ఎంపీపై ఛార్జ్ షీట్
ఆర్టీఐ కార్యకర్త అమిత్ జత్వా హత్య కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న గుజరాత్ లోని జునాఘర్ బీజేపీ ఎంపీ దిను సోలంకీపై సీబీఐ అభియోగ పత్రాన్ని నమోదు చేసింది. ఈ కేసులో గతంలో సదరు ఎంపీని సీబీఐ ప్రశ్నించింది. అనంతరం అరెస్టు కూడా చేసింది. ఆయన మేనల్లుడు శివ్ సోలంకి, మరో ఐదుగురునీ ఇదే కేసులో జైల్లో వేసింది. ఆర్టీఐ కార్యకర్తగా అక్రమ మైనింగ్ పై అమిత్ తరచూ ప్రచారం చేసేవాడు. అక్రమ మైనింగ్ పై కోర్టులో పిల్ కూడా దాఖలు చేసాడు. దాంతో, 2010 జులైలో గుజరాత్ హైకోర్టు బయట అతను హత్యకు గురయ్యాడు. తీవ్ర సంచలనం సృష్టించిన ఈ కేసులో ఎంపీ అమిత్ హత్యకు కుట్రపన్నారని అతని కుటుంబం ఆరోపించింది. ఈ క్రమంలో సీబీఐ అప్పటినుంచి దర్యాప్తు చేస్తోంది.