: మమతా బెనర్జీకి 5 లక్షల లైకులు


పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రాజకీయాల్లోనే కాదు, సోషల్ నెట్ వర్కింగ్ సైట్ 'ఫేస్ బుక్'లో కూడా దూసుకుపోతున్నారు. గత ఏడాది జూన్ 15న ఫేస్ బుక్ లో తన అఫీషియల్ పేజ్ ను మమతా బెనర్జీ ప్రారంభించారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆమె పేజ్ కు 5 లక్షలకు పైగా లైకులు వచ్చాయి. ఆమె తమ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలను తెలియజేసేందుకే కాకుండా, కేంద్ర ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించేందుకు కూడా ఫేస్ బుక్ ను వినియోగిస్తున్నారు. దీనికి తోడు ప్రముఖులకు నివాళులు అర్పించడానికి కూడా ఫేస్ బుక్ ను వాడుతున్నారు. ఇటీవలే మండేలాకు కూడా ఆమె దీన్నుంచి నివాళి అర్పించారు.

  • Loading...

More Telugu News