: ఇండియా 421 ఆలౌట్.. సౌతాఫ్రికా టార్గెట్ 458


సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో భారత్ 421 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో, సౌతాఫ్రికా విజయలక్ష్యాన్ని 457 పరుగులుగా భారత్ నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్ లో పుజారా 153 (270 బంతులు) పరుగులు చేయగా, కోహ్లీ 193 బంతుల్లో 96 పరుగులు చేసి తృటిలో మరో సెంచరీని చేజార్చుకున్నాడు. అనంతరం బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ (6), రహానే (15), ధోనీ (29), అశ్విన్ (7), ఇషాంత్ (4), షమీ (4)లు వెనువెంటనే ఔటయ్యారు. చివర్లో ధాటిగా ఆడిన జహీర్ 29 (31 బంతులు) పరుగులతో నాటౌట్ గా నిలిచాడు. సౌతాఫ్రికా బౌలర్లలో ఫిలాండర్, కలిస్ చెరో మూడు వికెట్లు తీసుకోగా... ఇమ్రాన్ తాహిర్, డుమిని చెరో రెండు వికెట్లు తీసుకున్నారు. ఈ రోజు ఆటలో మరో 43 ఓవర్లు మిగిలి ఉండగా, రేపు ఆటకు చివరి రోజు.

  • Loading...

More Telugu News