: ఢిల్లీలో డ్రగ్ రాకెట్ ముఠా గుట్టు రట్టు.. నిందితుల్లో ఒకరు తెలుగువాడు


దేశ రాజధాని ఢిల్లీలో డ్రగ్ రాకెట్ ముఠా గుట్టు రట్టయింది. మాదక ద్రవ్యాలను సరఫరా చేస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద భారీ మొత్తంలో మత్తుపదార్థాలు పట్టుబడ్డాయి. 9 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకొన్నామని, ఈ హెరాయిన్ విలువ సుమారు 30 కోట్ల రూపాయలు ఉంటుందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ ముఠా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 125 కిలోల హెరాయిన్ ను సరఫరా చేయగా.. అత్యధికంగా దక్షిణ భారతదేశంలోనే విక్రయించినట్లు నిందితులు పోలీసులకు వెల్లడించారు. పట్టుబడిన వారిలో ఒకరు ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లా వాసి వేణుగోపాల్ రెడ్డిగా గుర్తించారు. మిగతా ఇద్దరు పంజాబ్ రాష్ట్రానికి చెందిన వారు. మత్తు పదార్థాలను ఎక్కడ నుంచి తెస్తున్నారు, ఎవరికి విక్రయిస్తున్నారన్న విషయాలను పోలీసులు ఆరా తీస్తున్నారు.

  • Loading...

More Telugu News