: 80 శాతం మంది సమైక్యాన్ని కోరుకుంటున్నారని రాష్ట్రపతికి చెప్పా: మంత్రి కాసు
రాష్ట్రంలో దాదాపు 80 శాతం మంది సమైక్య రాష్ట్రాన్నే కోరుకుంటున్నారని రాష్ట్రపతికి తెలియజేశానని మంత్రి కాసు కృష్ణారెడ్డి తెలిపారు. ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరానని చెప్పారు. ఈ రోజు కాసు రాష్ట్రపతిని కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తాను చేసిన విజ్ఞప్తిని పరిశీలిస్తానని రాష్ట్రపతి హామీ ఇచ్చారని తెలిపారు.