: పీవీ సిందుకు 'స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డు
హైదరాబాదు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సిందు సీఎన్ఎన్ ఐబీఎన్ 'స్పోర్ట్స్ ఉమన్ ఆఫ్ ది ఇయర్' అవార్డుకు ఎంపికైంది. సీఎన్ఎన్ ప్రతి ఏటా ప్రకటించే ఈ అవార్డుల్లో క్రీడారంగంలో ఈసారి సిందుకు దక్కడం విశేషం. ఈ ఏడాది ప్రపంచ ఛాంపియన్ షిప్ లో కాంస్య పతకం గెలుచుకున్న సిందు.. మలేసియా ఓపెన్, మకావు గ్రాండ్ ప్రీ గోల్డ్ ఛాంపియన్ గా నిలిచింది. ఇదే ఏడాది సిందు అర్జున అవార్డును కూడా అందుకోవడం మరో విశేషం.