: అవినీతి ప్రధానాంశంగా మారింది: రాహుల్ గాంధీ
ప్రస్తుతం దేశంలో అవినీతి ప్రధానాంశంగా మారిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ అన్ని రంగాల్లోనూ నిర్ణీత సమయంలో పారదర్శకత తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రజాభిప్రాయాన్ని గ్రహించగలిగే ముందుచూపు రాజకీయ నాయకులకు అవసరం అని చెప్పారు. ప్రాజక్టులు పూర్తి చేసే విషయంలో జాప్యాన్ని సహించకూడదని ఆయన సూచించారు.