: తెలంగాణ బిల్లులో చాలా లోపాలున్నాయి: మంత్రి డొక్కా
తెలంగాణ బిల్లులో అనేక లోపాలున్నాయని మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ తెలిపారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ బిల్లుపై అసెంబ్లీలో సమగ్ర చర్చ జరగాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. చర్చలో మాట్లాడే అవకాశం వస్తే బిల్లులోని లోపాలు చెబుతానని అన్నారు. రాష్ట్ర విభజనతో సంబంధం లేకుండా 2011 జనాభా లెక్కల ప్రకారం షెడ్యూల్డు కులాలు, షెడ్యూల్డు తెగలకు కేటాయించే నియోజకవర్గాల సంఖ్యను పెంచాలని ఆయన డిమాండ్ చేశారు.