: విశాఖ సాగర తీరంలో సినీతారల క్రికెట్ మ్యాచ్
సాగర తీరంలో కాసేపట్లో క్రికెట్ హంగామా మొదలవుతోంది. క్రికెట్ అభిమానులు, సినీ తారలతో విశాఖ నగరం కళకళలాడుతోంది. విశాఖపట్నంలోని వైఎస్సార్-వీడీఏ క్రీడా మైదానం ఇందుకు వేదికగా నిలిచింది. సినీ, క్రీడాభిమానులతో వైఎస్సార్-వీడీఏ క్రికెట్ స్టేడియం కిటకిటలాడుతోంది. సినీ తారలు స్టేడియంలో కలియ తిరుగుతూ అభిమానులకు అభివాదం చేస్తున్నారు. ఈ మ్యాచ్ లో తలపడుతోన్న సినీ తారలతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత సుబ్బరామిరెడ్డి, సీనియర్ నటుడు మోహన్ బాబు కూడా ఉన్నారు.