: విడుదలైన రోజే 'ధూమ్ 3' కొత్త రికార్డు!
బాలీవుడ్ యాక్షన్ ఎంటర్ టైనర్ 'ధూమ్ 3' కొత్త రికార్డు నెలకొల్పింది. విడుదలైన తొలిరోజే అంటే నిన్న (శుక్రవారం) 36 కోట్లు వసూలు చేసింది. దాంతో, నిన్నటివరకు 'చెన్నై ఎక్స్ ప్రెస్' పేరిట ఉన్న రికార్డును ఈ చిత్రం అధిగమించింది. అటు తెలుగు, తమిళ బాషల్లో విడుదలైన ధూమ్ నాలుగు కోట్లు రాబట్టింది. దాంతో, ఈ వారం చివరిలోగా వందకోట్ల మార్కును అతి తక్కువ సమయంలో చేరుకుంటుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మరోవైపు ఈ వసూళ్లను చూసి హిందీ చిత్ర వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి.