: అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయి: అశోక్ బాబు


సీమాంధ్ర ప్రాంతంలోని 158 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీలో విభజన బిల్లును వ్యతిరేకించాలని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు డిమాండ్ చేశారు. బిల్లు అసెంబ్లీకి వచ్చినందువల్ల అన్ని పార్టీలు ఏకతాటిపై నడవాలని కోరారు. హైదరాబాద్ ఏపీఎన్జీవో హోంలో అఖిలపక్షంతో సమావేశం ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రెండుమూడు రోజుల్లో అన్ని పార్టీలతో మరోసారి సమావేశమై, రాష్ట్రపతిని కలిసే అంశాన్ని పరిశీలిస్తామని తెలిపారు. ఏపీఎన్జీవోల ఉద్యమానికి అన్ని పార్టీలు మద్దతు ప్రకటించాయని అశోక్ బాబు చెప్పారు. ఈ సమావేశంలో రాజకీయాలపై చర్చించలేదని తెలిపారు.

  • Loading...

More Telugu News