: నిజామాబాదులో అక్రమ నిర్మాణాల తొలగింపు.. అడ్డుకుంటున్న ఆక్రమణదారులు
నిజామాబాద్ నగరంలో ఇవాళ ఉదయం అక్రమ నిర్మాణాల తొలగింపు కార్యక్రమాన్ని కార్పొరేషన్ అధికారులు చేపట్టారు. స్థానిక రైల్వేస్టేషన్ నుంచి బస్టాండ్ వరకు ఉన్న అక్రమ నిర్మాణాలను ప్రొక్లెయిన్ సాయంతో కూల్చివేస్తున్నారు. ఆక్రమణదారులు అధికారులను అడ్డుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా ప్రొక్లెయిన్ డ్రైవర్ పై దాడి చేసేందుకు యత్నించిన ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.