: ఎర్రచందనం స్మగ్లర్లతో సీఎంకు సంబంధాలున్నాయి: శంకర్రావు


సీఎం కిరణ్ పై మాజీ మంత్రి శంకర్రావు మరోసారి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చిత్తూరు జిల్లా ఎర్రచందనం స్మగ్లర్లతో కిరణ్ కు సంబంధాలున్నాయని ఆరోపించారు. అందుకే, అటవీశాఖ సిబ్బందిని స్మగ్లర్లు చంపేసిన రోజు సీఎం అసెంబ్లీకి కూడా రాలేదని చెప్పారు. అసెంబ్లీకి వస్తే విపక్షాలు రచ్చరచ్చ చేస్తాయని... నిజం బయటపడేలా చేస్తాయనే భయంతోనే ఆయన డుమ్మా కొట్టారని తెలిపారు. ఆరోజు ముఖ్యమంత్రికి ఎలాంటి అనారోగ్యం లేదని, ఆయన్ను చూడ్డానికి ఏ డాక్టర్ రాలేదని చెప్పారు.

  • Loading...

More Telugu News