: నిబంధనలు అందరికీ ఒకేలా ఎందుకు లేవు?: 'బాయ్'పై గుత్తా జ్వాల ఫైర్
ఫైర్ బ్రాండ్ గుత్తా జ్వాల మరోసారి బాయ్ (బ్యాడ్మింటన్ సంఘం)పై విరుచుకుపడింది. ఢిల్లీలో ఆమె మాట్లాడుతూ షెడ్యూల్ బిజీగా ఉన్నప్పుడు జాతీయ ఛాంపియన్ షిప్ లో ఎందుకు పాల్గొనాలని నిలదీసింది. తీరిక లేని షెడ్యూల్ కారణంగా సైనా టోర్నీకి దూరంగా ఉండడాన్ని సమర్థించిన జ్వాల, అందరు క్రీడాకారులకు అదే రూల్ ఎందుకు వర్తింపచేయడం లేదని ప్రశ్నించింది. కొందర్ని ఆడాలని బలవంత పెడుతూ, మరి కొందరికి మినహాయింపునిస్తూ బాయ్ పక్షపాతంగా వ్యవహరిస్తోందని మండిపడింది.