: అజ్లాన్ షా టోర్నీలో పాక్ ను చిత్తు చేసిన భారత్
చిరకాల ప్రత్యర్ధి పాకిస్తాన్ పై భారత హాకీ జట్టు ఘనవిజయం సాధించింది. మలేసియాలో జరుగుతున్న అజ్లాన్ షా హాకీ టోర్నీలో ఈరోజు సాయంత్రం జరిగిన లీగ్ మ్యాచ్ లో భారత్ 3-1 తో పాక్ ను చిత్తు చేసింది. ఫైనల్ ఆశలు మెరుగుపరుచుకోవాలంటే తప్పక నెగ్గాల్సిన మ్యాచ్ లో భారత ఆటగాళ్లు కలిసికట్టుగా కదం తొక్కారు. వరుసగా రెండు మ్యాచ్ లలో పరాజయాల తర్వాత భారత్ కు ఇది తొలి విజయం.