: శ్రీవారిని దర్శించుకున్న మంచు మనోజ్
తిరుమల శ్రీవారిని సినీనటుడు మంచు మనోజ్ ఈరోజు ఉదయం దర్శించుకున్నాడు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నాడు. అనంతరం మనోజ్ మాట్లాడుతూ, ఇటీవల హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన కారు ప్రమాదంలో గాయపడిన తాను త్వరగా కోలుకోవడంతో శ్రీవారికి మొక్కు తీర్చుకొనేందుకు వచ్చినట్టు తెలిపాడు.