: ఫేస్ 'బుక్' అయిన వ్యక్తి
సామాజిక సైటే కదా అని ఏది పడితే అది పోస్ట్ చేస్తే చూస్తూ ఊరుకోమంటున్నారు పోలీసులు. పోస్ట్ చేసే ప్రతి అంశాన్ని నిఘా కళ్లతో పరీక్షిస్తూ, ఏ మాత్రం వివాదాస్పద అంశమున్నా చేతికి బేడీలు వేస్తున్నారు. తాజాగా అలాంటి సంఘటన లక్నోలో జరిగింది.
జాతీయ నేతలు ప్రధాని మన్మోహన్ సింగ్, కేంద్ర మంత్రి కపిల్ సిబల్, సమాజ్ వాదీ పార్టీ అధినేత ములాయం సింగ్ మొదలైన నేతలపై ఫేస్ బుక్ లో వివాదాస్పద పోస్టుతో ఓ వ్యక్తి జైలు పాలయ్యాడు. ఆగ్రాకు చెందిన సంజయ్ చౌధురి అనే వ్యక్తి జాతీయ నేతలపై వివాదాస్పద కార్టూన్లు ఉన్న పోస్ట్ ను ఫేస్ బుక్ లో పెట్టినట్లు సమాచారం. ఇతనిని అరెస్టు చేసిన పోలీసులు అతని నుంచి ల్యాప్ టాప్, సిమ్ కార్డు, డేటా కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.