: ఎం'చొక్కా' మరక పడదు!


చొక్కా సూపర్‌ అంటే అంత బాగుంటుందా... అని మీ సందేహం. బాగుంటుంది అంటే రంగు గురించి కాదు... దాని గుణం గురించి. ఏమంటే, అది ఎలాంటి మరకలను తనకు అంటించుకోదు. అంటే, తనపై అసలు ఎలాంటి మరక పడేందుకు అవకాశం ఇవ్వకుండా ఉంటుందట. అది దాని స్పెషాలిటీ! అలాంటి ఒక కొత్తరకం టీ షర్టును పరిశోధకులు తయారుచేశారు.

భారత సంతతికి చెందిన ఒక ఔత్సాహిక పారిశ్రామికవేత్త ఒక కొత్తరకం టీ`షర్టును తయారుచేశారు. ఈ షర్టుపైన ఎలాంటి మరకలూ పడకుండా ఉంటుందట. మనం కాఫీ, టీ లాంటివి తాగే సమయంలో పొరబాటున ఒలికిపోతే ఇక షర్టుపై మరకలు ఖాయం. కానీ ఈ షర్టుపైన ద్రవపదార్ధాలకు చెందిన ఎలాంటి మరకలు పడే అవకాశమే లేదని ఆయన చెబుతున్నారు. ఆ విధంగా ఈ షర్టును తయారుచేశారట. దీనిని ఆయన 'సిలిక్‌'గా పేర్కొన్నారు!

ద్రవ పదార్ధాలను ఏమాత్రం పీల్చుకోకుండా, ఒకవేళ పొరబాటున పడినా కూడా వెంటనే జారిపోయేలా దీన్ని తయారుచేశారు. అలా ద్రవపదార్ధాలు జారిపోయే సూపర్‌ హైడ్రో ఫోబిక్‌ నానో టెక్నాలజీని ఈ టీ`షర్టు తయారీలో వాడారు. దీనివల్ల గుడ్డకు, ద్రవపదార్థ పరమాణువులకు మధ్య ఒక గాలిపొర ఏర్పడుతుంది. అప్పుడు గుడ్డ ద్రవపదార్థాన్ని పీల్చుకోదు. మొత్తానికి ఈ షర్టు భలేగా ఉంది... మరి దీన్ని ఎలా ఉతకాలో... అసలు ఉతకాల్సిన అవసరమే లేదేమోకదా...!

  • Loading...

More Telugu News