: ఇక భౌభౌ భాష కూడా తెలుసుకోవచ్చు!


కుక్క భాష ఏమిటి...? భౌభౌ...! దేనికైనా దాని భాష దాదాపుగా ఇదే ఉంటుంది. ఒక్కోసారి కుయ్యిమంటుంది. మరోసారి కయ్‌ మంటుంది. అసలు దీని భాష ఏమిటి? అనేది మనకు అర్ధం కాదు. అందుకే కుక్క భాషను అర్థం చేసుకోవడానికి పరిశోధకులు ప్రయత్నించారు. చివరికి విజయం సాధించారు. కుక్క భాషను మన భాషలోకి తర్జుమా చేసే ఒక సరికొత్త పరికరాన్ని పరిశోధకులు తయారుచేశారు. ఈ పరికరంతో మనం మన కుక్క భాషను చక్కగా అర్థం చేసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

స్కాండినేవియాకు చెందిన నార్డిక్‌ సొసైటీ ఫర్‌ ఇన్‌వెన్షన్‌ అండ్‌ డిస్కవరీకి చెందిన శాస్త్రవేత్తలు కుక్క భాషను కనిపెట్టే ఒక సరికొత్త పరికరాన్ని తయారుచేశారు. ఈ పరికరాన్ని కుక్క తలకు తగిలిస్తే అది ఏమంటోంది? అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చట. నో మోర్‌ వూఫ్‌ అనే ఈ పరికరం బ్రెయిన్‌ స్కానింగ్‌ పరిజ్ఞానం ద్వారా కుక్క ఆలోచనా విధానాన్ని కనిపెట్టి దాని భాషను మన భాషలోకి తర్జుమా చేస్తుందట. కుక్క అరుపుల ఆధారంగా శాస్త్రవేత్తలు ఇప్పటికే కొన్నింటిని అలా తర్జుమా చేశారు.

అవి ‘‘ఇది చాలా బాగుంది... నన్ను ఒంటరిగా వదిలేయ్‌... నాకు చాలా అలసటగా ఉంది... ఆకలిగా ఉంది... నువ్వెవరు?... మీరెందుకు నన్ను వదిలి వెళ్లిపోతున్నారు...’’ వంటి పదాలతో కూడినవి. ఈ పరికరం అనేది ప్రాథమిక నమూనా మాత్రమేనని, దీన్ని మరింతగా అభివృద్ధి పరచాల్సి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.

  • Loading...

More Telugu News