: ఆసియా ఆర్చరీలో భారత్ కు పసిడి
బ్యాంకాక్ లో జరుగుతున్న ఆసియా ఆర్చరీ టోర్నీలో భారత్ కు బంగారు పతకం దక్కింది. ఈ గ్రాండ్ ప్రీ టోర్నీలో తెలుగుతేజం చిట్టిబొమ్మ జిజ్ఞాస్ తో పాటు సందీప్ కుమార్, అభిషేక్ వర్మలు భారత పురుషుల జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. మంగళవారం జరిగిన ఫైనల్ లో భారత కుర్రాళ్లు వియత్నాంపై జయభేరి మోగించారు.