: పూజలు చేయించుకునేందుకు పాపాత్ములే వస్తారు: ఎమ్మెస్సార్


కాంగ్రెస్ సీనియర్ నేత, ఆర్టీసీ చైర్మన్ ఎమ్ సత్యనారాయణరావు కల్మషం లేని వ్యాఖ్యలు చేస్తుంటారు. అందుకే, ఆయనని అందరూ అభిమానిస్తారని రాజకీయవర్గాల్లో వినిపించే వ్యాఖ్యానం. మరోసారి ఆయన తనదైన వ్యాఖ్యలతో ఆకట్టుకున్నారు. శ్రీకాళహస్తిలో ఈ రోజు ఆయన రాహుకేతు పూజలు చేయించుకుని, మహాశివుడ్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తనను కలిసిన పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ, పాపం చేసినవాళ్లే విముక్తి కోసం శ్రీకాళహస్తిలో పూజలు చేయించుకుంటారని, తాను కూడా ఎప్పుడో ఏదో పాపం చేసి ఉంటానని.. అందుకే పూజలు చేయించుకునేందుకు వచ్చానని అన్నారు. తప్పు చేసిన వారు శివయ్య చెంత రాహుకేతువుల పూజలు చేస్తే వాటి నుంచి ఆయన విముక్తి కలిగిస్తాడని.. శివయ్యను దర్శించుకునే భాగ్యం తనకు ఇప్పటికి లభించిందని అన్నారు.

  • Loading...

More Telugu News